డిజిటల్ తరగతులకు గోదావరి ప్రవాసుల విరాళం
డల్లాస్లో ఇటీవల నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసుల సమావేశంలో పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ, టి.నర్సాపురం జడ్పీ సభ్యుడు నల్లూరి చలపతిరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో 250 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ప్రవాసులు చేయూతనందిస్తే నూర శాతం డిజిటల్ తరగతులు కలిగిన జిల్లాగా పశ్చిమ గోదావరి నిలుస్తుందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ప్రవాసులు ?10లక్షల చెక్కును గోదావరి ప్రవాసుల సంఘం తరఫున ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి ప్రవాసుల సంఘం అధ్యక్షుడు డా.యంత్ర సుబ్బారావు, కార్యదర్శి పుసులూరి సుమంత్, కోశాధికారి చిలుకూరి రాంప్రసాద్, డా.ఆచంట చౌదరి, కుమార్ పిచికల, స్వామి కాకర్ల, నాగు ఉప్పులూరి, చంద్రశేఖర్, బాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, డిట్రాయిట్, మినియాపోలిస్, శాన్ఫ్రాన్సిస్కో, బే-ఏరియా ప్రాంతాలకు చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు.













