NRI Couple: బసవతారకం ఇండో ఆస్పత్రికి ఎన్నారై దంపతుల భారీ విరాళం
హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్ట్టిట్యూట్ (basavatarakam cancer hospital) కు తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ సుదనగుంట్ల రాఘవేంద్ర ప్రసాద్, శ్రీమతి సుదనగుంట్ల కళ్యాణి ప్రసాద్ దంపతులు 5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. సుదనగుంట్ల కుటుంబం యొక్క దాతృత్వం మరియు క్యాన్సర్ పరిశోధన పట్ల ఉన్న నిబద్ధత లెక్కలేనన్ని జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. ఈ కేంద్రం వినూత్న పరిశోధన మరియు క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక పురోగతికి కేంద్రంగా ఉంటుందని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) చెప్పారు. ఆస్పత్రికి విరాళం ఇచ్చిన రాఘవేంద్ర ప్రసాద్ దంపతులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంల ఆస్పత్రి ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







