32 దేశాలలో టిఆర్ఎస్ పార్టీ శాఖలు
-విదేశాలలో టిఆర్ఎస్ పార్టీ కి పెరుగుతున్న ఆదరణ
-డిసెంబర్ లోపు 50 దేశాలకు విస్తరణ
-పురోగతి పైన చర్చ
-టిఆర్ఎస్ ఎన్నారై సలహాదారు ఎంపీ కవిత గారితో సమావేశమైన కోఆర్డినేటర్ మహేష్ బిగాల
రోజు రోజుకి విదేశాలలో టిఆర్ఎస్ పార్టీ కి ఆదరణ పెరుగుతుంది. ఏడూ ఖండాలలోనే కాకుండా దీవులలో కూడా టిఆర్ఎస్ పార్టీ శాఖలు విస్తరిస్తున్నాయి. విస్తరించడమే కాకుండా చాల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాయి. టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఇవన్నీ దేశాలలో టిఆర్ఎస్ జెండా ఎగురవేస్తున్నారు.
మహేష్ బిగాల టిఆర్ఎస్ ఎన్నారై సలహాదారు ఎంపీ కవిత గారితో మంగళవారం సమావేశమై విదేశాలలో పార్టీ పురోగతి గురించి చర్చించారు. ఎంపీ కవిత గారు జరుగుతున్న పురోగతి పైన సంతృప్తి వ్యక్తం చేసారు. తర్వాత మాట్లాడుతూ సీఎం కెసిఆర్ గారి ఆదేశాల మేరకు గడిచిన ఏడాది కాలంలోనే 32 దేశాలలో పార్టీ శాఖలను ప్రాంభించామన్నారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, బెహ్రయిన్, యూరోపు ఖండంలోని డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, పోలాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, లాట్వియా లతో పాటు ఆఫ్రికా ఖండంలోని సౌత్ ఆఫ్రికా, ఇథోపియా, మాల్వాయి, బోత్స్వానా, జాంబియా, సౌత్ అమెరికా లోని పెరు, కొలంబియా, పరాగ్వే, ఏసియా లోని సింగపూర్, మలేషియా, చైనా, గల్ఫ్ దేశాలైన కతర్, ఒమాన్, కువైట్, సౌథీ అరేబియా దీవిలైన మాల్దీవ్స్ లలో పార్టీ శాఖలను పారంభించామన్నారు.
ఈ శాఖలు పార్టీ తెలంగాణ అవతారం దినోత్సవ వేడుకలు, దీక్ష దివాస్ లను ఘనంగా నిర్వహిస్తున్నాయి అన్నారు. ప్రతి సంవత్సరం జరిగే ప్లీనరీ కి పార్టీ ఎన్నారై లు చాలామంది హాజరవుతూ పార్టీ కి అండగా ఉంటున్నారు అన్నారు. హరితహారం,నేతన్నకు చేయూత లాంటి పథకాలకు తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు.రైతుబంధు ఫథకం లో భాగంగా తనతో సహా పలువురు పెట్టుబడి సహాయంని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చారు అని తెలిపారు.
ఫిలిఫైన్స్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి వచ్చినా వినతుల మేరకు ఆ దేశాలు పర్యటించి శాఖలను ప్రారంభిస్తామన్నారు. గల్ఫ్ దేశాలనుండి కూడా పార్టీ పారంబించాలని వినతుల వెల్లువ వస్తున్నా సందర్బంగా త్వరలో అక్కడ పర్యటిస్తామన్నారు.













