మిల్పిటాస్ అభివృద్ధి కమిషనర్గా రఘురెడ్డి
తెలుగు వ్యక్తికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగర సామాజిక, అభివృద్ధి కార్యక్రమాల కమిషనర్గా తెలంగాణకు చెందిన రఘురెడ్డిని నియమితులయ్యారు. సూర్యాపేట కు చెందిన కాకి రఘురెడ్డి పదిహేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. కాలిఫోర్నియాలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. అమెరికా తెలుగు సంఘం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా మిల్పిటాస్ నగర కౌన్సిల్ సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు కమిషనర్గా గవర్నమెంట్ నియమించింది. నగర కౌన్సిల్లో జరిగిన కార్యక్రమంలో రఘురెడ్డికి నియామక పత్రాన్ని అందించి అభినందించారు.













