US: అమెరికా లో స్టూడెంట్స్ కి నోటీసులు.. ఆందోళనలో తెలుగు విద్యార్థులు
జనవరి నెలాఖరులో అమెరికా అధ్యక్షులుగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసిన మొదటి. 2-3 వారాల్లో అమెరికాలో స్టూడెంట్ వీసా (Student Visa) మీద చదువుకున్న వారు పూర్తి గా స్టూడెంట్ వీసా రూల్స్ ప్రకారం ఉండాలని, కేవలం వారానికి 20 గంటలు, అందునా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉద్యోగం చేయవచ్చునని, అంతకు భిన్నంగా ఎవరు ఉన్నా వారు అమెరికా దేశం లో అక్రమంగా ఉన్నట్టే అని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పటం స్టూడెంట్స్ అందరూ భయాందోళనలు చెందటం అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఆ పాయింట్ ను సరిగ్గా అర్థం చేసుకొని స్టూడెంట్స్ అందరూ తమ తమ ఉద్యోగాలను సరిచేసుకోవటం జరిగి, ఆ ఆందోళన సద్దుమణిగింది అనే చెప్పాలి. లీగల్ గా పద్దతి గా ఉంటే ఎలాంటి సమస్య లేదు అని అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
అయితే 15 రోజులుగా దాదాపు అన్ని యూనివర్సిటీ లలో చదువుకుంటున్న విద్యార్ధులకు ఇమ్మిగ్రేషన్ ఆఫీసు నుంచి (EVIS – Students and Exchange Visitor Information System) నుంచి నోటీసులు ఇమెయిల్ ద్వారా రావడం మొదలయ్యాయి. ఈ విధంగా నోటీసులు వచ్చిన వారి సంఖ్య లో వేల లో ఉందని తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో అమెరికాలో చట్టం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకొందాం. అమెరికా లో స్పీడ్ లిమిట్ దాటి వెళితే పోలీసులు పట్టుకుని స్పీడిరగ్ నేరంగా టికెట్ ఇస్తారు. సాధారణంగా చిన్న వార్నింగ్, కొద్దిపాటి ఫైన్‌తో ఈ కేసులు ముగుస్తాయి. ఎక్కువ సార్లు స్పీడింగ్ కేసులు, DUI (Driving Under Influence) అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటే ఆ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అలాగే షాప్‌లలో చేసే చిన్న చిన్న చిల్లర దొంగతనాలకు కూడా పోలీస్‌లు చిన్న వార్నింగ్, కొంచెంగా ఫైన్ వేయడం జరుగుతూ వుంటాయి. అలాగే పూల్ పార్టీ అని విద్యార్థులు, యువకులు పార్టీ పేరుతో ఇంటి పక్కన ఉన్న వారి ప్రశాంతత ను బంగపరుస్తే, పోలీసులు ఆ యువకుల మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఇవి అన్ని పూర్తిగా క్రిమినల్ కేసులు కావు. అయితే పోలీస్ రికార్డు లోకి వెళ్లిన కేసులు.
ఇప్పుడు అమెరికాలో విద్యార్ధులకు గతంలో వారిపై ఉన్న చిల్లర కేసులు బయటకు తీసి వారి F1 (స్టూడెంట్ వీసా) వీసాను వెనక్కు తీసుకొని, దేశం నుంచి బయటకు పంపటానికి నోటీసులు పంపుతున్నారు. ఎప్పుడో కార్ డ్రైవ్ చేస్తూ చేసిన స్పీడిరగ్ నేరానికి ఇప్పుడు ఈ శిక్ష ఏమిటీ అని విద్యార్దులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
ఇది స్టూడెంట్ పెండమిక్గా భావించాలి: KP సోంపల్లి
బోస్టన్ నగరం నుంచి తానా నాయకులు, ఫ్రాంక్లిన్ స్కూల్ కమిటీ మెంబర్ కేపి సోంపల్లి మాట్లాడుతూ సాధారణంగా కారు డ్రైవింగ్ విషయంలో ఉండే కేసుల గురించి ఒక ఫ్లయర్ , తరువాత వేరు వేరు పట్టణాల్లో ఉండే ఇమ్మిగ్రేషన్ లాయర్ల వివరాలు అన్ని చోట్ల విద్యార్థులకు అందుబాటులో ఉంచామని, విద్యార్థులు వారి వీలును బట్టి ఇమ్మిగ్రేషన్ లాయర్‌ను సంప్రదించి ముందుకు వెళ్లాలని సూచించారు. నోటీసులు వచ్చినా, రాక పోయినా విద్యార్థులు అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని, ఇండియాలో తల్లిదండ్రులకు అన్ని విషయాలు వివరించి రాబోయే రోజుల్లో వచ్చే సమస్యలకు తయారుగా ఉండాలని, ముఖ్యంగా ఎలాంటి పోలీస్ కేసులోకి వెళ్లకుండా పూర్తి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు.
అన్ని విధాల సహాయం చేయడానికి ఆటా సిద్ధంగా ఉన్నది: జయంత్ చల్లా, ఆటా ప్రెసిడెంట్
ఆటాలో కూడా ఆటా సేవా (ATA SEVA – Service Of Emergency Voluntary Assistance) అనే విభాగం ఉంది. అందులో దాదాపు 400 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. మేము కూడా మాకు వచ్చిన ఫోన్ లు, మెయిల్స్‌కి వెంట వెంటనే అటెండ్ అవుతున్నా ము. మాకు తెలిసిన, మా నెట్‌వర్క్‌లో వున్న అటార్నీ లను ఆ స్టూడెంట్స్‌కి కనెక్ట్ చేస్తున్నాం. అయితే విద్యార్థులు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోవా ల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితు లలో పూర్తి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. వర్క్ పర్మిట్ లేకుండా పని చేయడం, స్పీడ్ డ్రైవింగ్ చేయడం లాంటి పనులు చేయకూడదు. ఉద్యోగం లేకపోయినా చదువుకోగలిగే విధంగా ఫైనాన్స్‌లు ఆరెంజ్ చేసుకోవడం చేయాలి.
తానా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది: డా. నరేన్ కొడాలి. తానా వైస్ ప్రెసిడెంట్
15 రోజులుగా తానా ఈ సమస్యపై పని చేస్తోంది. మొదటగా నోటీసులు వచ్చిన విద్యార్థులు కాకుండా అందరికి అవగాహన కలిగేలా స్పీడ్ డ్రైవింగ్‌ని తప్పుగా పరిగణించే విధానంలో క్యాటగిరీస్ మీద ఒక ప్లయెర్ చేసి విస్తృతంగా ప్రచారం చేసాము. అన్ని సిటీ లలో వున్న ఇమ్మిగ్రేషన్ అటార్నీల వివరాలు కూడా విస్తృతంగా ప్రచారం చేసాం. మేము గాని, మేము చెప్పిన అటార్నీలు గాని ప్రతి కేసుని పరిశీలించి ఆ విద్యార్థికి వున్న సాధ్యాసాధ్యాలను వివరిస్తున్నాం. ఈ నోటీసులు వచ్చిన విద్యార్థులు చదువుకొంటున్న కాలేజీలు, యూనివర్సిటీలతో మాట్లాడి వారు ఏమైనా సహాయం చేయగలరా అనే విషయం చర్చిస్తున్నాం.
మేము ఫెసిలిటేటర్లుగా పని చేస్తూ మా సహాయం అందచేస్తున్నాం: మదన్ పాములపాటి, NATS ప్రెసిడెంట్
నాట్స్ కూడా వచ్చిన కేసులు అన్నింటిని తీసుకొని తగిన సూచనలు ఇస్తోంది. మాకు కూడా Helpline నంబర్స్ చూసి ఫోన్లు చేస్తున్నారు. మేము ప్రతి కేసుని పరిశీలించి వారికీ దగ్గరలో వున్న అటార్నీకి కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నోటీసులు వచ్చింది వున్న విద్యార్థులలో 1% వాళ్ళకి. కానీ పానిక్ సిట్యుయేషన్ వలన అందరూ ఆందోళనలో వున్నారు. కనుక మన కర్తవ్యం ఆ భయాందోళనలు పడకండి అని చెప్పటం. అన్ని తెలుగు సంఘాలు కలిసి కట్టుగా పనిచేసి ఈ విషయంలో విద్యార్థులకు అండగా ఉంటాము.
వెబినార్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం: శ్రీనివాస్ గనగోని, వీAుA నాయకుడు
మేము ప్రత్యేకంగా SEVIS నుంచి వస్తున్న నోటీసులు దృష్టిలో ఉంచుకొ ని 4 ఏప్రిల్ 2025 నాడు ఒక ఇమ్మిగ్రేషన్ వర్క్‌షాప్ – వెబినార్ నిర్వహించాం. దాదాపు 200 మంది ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. వెంటనే 10 ఏప్రిల్ 2025 న ఇద్దరు అటార్నీ లతో ఇంకొక వెబినార్ నిర్వహించాము. కొందరు విద్యార్థుల తరఫున ఒక Law Suit ఫైల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మాట సంస్థ తరపున లీగల్ సెల్ కూడా చురుగ్గా పనిచేస్తోంది.
విద్యార్థులు మొదటగా ఇమ్మిగ్రేషన్ లాయర్ సహాయం తీసుకోవాలి: భాను ఇల్లింద్ర, ఇమ్మిగ్రేషన్ అటార్నీ
నోటీసు వచ్చిన వెంటనే విద్యార్థులు తమకు తెలిసిన పెద్దవాళ్లతో, ఇండియాలో వున్న తల్లిదండ్రులతో మాట్లాడి తాను ఈ విషయంలో ఎం చెయ్యాలో (Course of action) నిర్ణయించుకోవాలి. వెంటనే ఒక ఇమ్మిగ్రేషన్ లాయర్ని సంప్రదించి, తన కేసు వివరాలు పూర్తిగా చెప్పాలి. కేసును బట్టి ఎలా ముందుకు వెళ్ళాలో ఆ లాయర్ సూచిస్తే దాని ప్రకారం నడుచుకోవాలి. మా కంపెనీతో సహా అనేక మంది భారతీయ మరియు తెలుగు అటార్నీలు ఈ సమస్య మీద పని చేస్తున్నారు.
నోటీసులలో ఇచ్చిన కారణాలు విశ్లేషించుకొని ముందుకు వెళ్ళాలి: జనేత రెడ్డి, ఇమ్మిగ్రేషన్ అటార్నీ
ప్రతి విద్యార్థి మొదటగా తనకు వచ్చిన నోటీసు లో చూపించిన కారణాలు సున్నితమైనవా ? (స్పీడ్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్ లాంటి చిన్న తప్పులు) లేదా జఠిలమైనవా ? (పోలీస్ స్టేషన్ లో వేలు ముద్రలు కూడా ఇచ్చిన కేసులు, తీవ్రమైన డ్రంక్ డ్రైవింగ్, షాప్‌లో పెద్ద దొంగతనం, వయోలెన్స్ యాక్ట్ కేసులు) అని విశ్లేషించుకుని వెంటనే ఇమ్మిగ్రేషన్ లాయర్ని కలిసి వచ్చిన నోటీసుకి సమాధానంగా పిటిషన్ ఫైల్ చేయాలి. సున్నితమైన కారణాలతో వచ్చిన నోటీసుల విషయంలో ముందుకు వెళ్ళవచ్చు. ఏమైనా వచ్చే వారం రోజులలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనే విషయం తెలుస్తుంది.
“ఇది చాలా పెద్ద సమస్య. పరిస్థితులు పూర్తిగా తెలుసుకోవడం అవసరం” : సంతోష్ సోమిరెడ్డి, అటార్నీ
సోమిరెడ్డి లా గ్రూప్ సంస్థ గత 7 సంవత్సరాలుగా వాషింగ్టన్ డీసీ లో మెయిన్ ఆఫీస్, అనేక రాష్ట్రాలలో ఆఫీస్ లతో వున్న పేరొందిన లీగల్ ఫర్మ్. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థులు వారి F1 వీసా రద్దు చేస్తూ దేశం విడిచి వెళ్ళిపోవాలి అని వస్తున్న నోటీసు ల గురించి మాట్లాడుతూ శ్రీ సంతోష్ సోమిరెడ్డి అనేక విషయాలు తెలిపారు. ఆయన చెప్పిన విషయాలలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ..
పాలస్తీనా కు మద్దతు గా కొన్ని చోట్ల కొందరు విద్యార్థులు చేసిన ప్రొటెస్ట్ అల్లర్లను ఫెడరల్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా పరిగణించి ఎట్టి పరిస్థితులలోను అమెరికా లో అలాంటి మద్దతుదార్లను ఉండనివ్వకూడదు అనే దృఢ సంకల్పం తో తీసుకొన్న నిర్ణయమే ఈ నోటీసు లు.
మా ఆఫీస్ కి చాలా మంది విద్యార్థులు కనెక్ట్ అయ్యారు. మా ఆఫీస్ లో అందరూ రాత్రింబవళ్ళు ఈ ఇష్యూ మీద పని చేస్తున్నాం. నేను మొదటి సారి గా వారం రోజుల క్రితమే ONLINE లో ముంచుకొస్తున్న ప్రమాదం గురించి మాట్లాడాను. పొంచి ఉన్న ప్రమాదం ఎంత పెద్దదో తెలుసుకుంటే ఆ ప్రమాద పరిస్థితుల్లో ఏమి చెయ్యొచ్చు అని నిర్ణయం చేసుకోవచ్చు. అయితే ప్రమాదం ఏమీ లేదు అనుకోవడం ఇంకా పెద్ద ప్రమాదం.
ఇప్పుడు నోటీసు వచ్చిన విద్యార్థులకు రెండే దారులు. ఒకటి నోటీసు ప్రకారం అమెరికా వదిలి వెళ్లిపోవడం ( Self Deportation ). రెండవది : Reinstate చెయ్యమని పిటిషన్ వెయ్యడం. మేము ఇప్పటికే చాలా Reinstatement letters ఫైల్ చేసాము. ఒక law suit గూడా ఫైల్ చేసాము.
విద్యార్థులకు నోటీసు లు పంపిన సమయం లోనే ఆ ఏరియా లలో వుండే ICE ( Immigration & Customs Enforcement ) ఆఫీసర్ లకు కూడా సమాచారం ఇచ్చారు. అందు వలన ఆ విద్యార్థులు అరెస్ట్ అయ్యే ప్రమాదం వుంది. ఈ విధం గా ఒక విద్యార్థి దగ్గరకు వచ్చిన ఒక ఆఫీసర్ తో మాట్లాడితే తెలిసిన విషయం – ఆ ఆఫీసర్ లు కూడా అమాయకులను శిక్షిస్తున్నామని తెలుసునని , కానీ మా ఉద్యోగం ప్రకారం మేము మా పని చేస్తున్నాం అని అన్నారు.
గతంలో వేరే కేసు లో పోలీస్ లకు వేలి ముద్రలు ఇచ్చిన విద్యార్థుల విషయం లో ( గతం లో జరిగిన కేసు లో నిర్దోషులు గా బయటకు వచ్చినా సరే !!) ఇప్పటి నోటీసు కేసులలో బయట పడటం కష్టమే ! అలాంటి వారు Reinstatement appeal చేసుకొన్నా , వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ. మామూలుగానే నెలకు ఒక reinstatement కేసు ఫైల్ చేస్తే USIS నుంచి తీర్పు రావడానికి 8- 10 నెలలు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో వేల సంఖ్య లో అప్పీల్ చేసుకొనే వారికి ఒక్కో కేసులో తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. తీర్పు అనుకూలంగా వచ్చే వరకు ఆ విదార్థి ఏ వుద్యోగం చెయ్యకూడదు. ఎప్పుడైనా అరెస్ట్ అవ్వవచ్చు. అందుకని ఆలాంటి కేసు లు వున్నా విద్యార్థులు ప్రస్తుతం దేశం వదిలి వెళ్లిపోవడమే మంచిది!. మళ్ళీ వీసా తీసుకొని రావదానికి అవకాశం వుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు , లేదా వారి శ్రేయోభిలాషులు ఈ విషయాలన్నీ అర్ధం చేసుకొని ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం !
మేము కూడా ఇప్పటికే ఫైల్ చేసిన Lawsuit ని జడ్జి స్వీకరించి కేసును నడిపే విధానం బట్టి ముందు ముందు అలాంటి కేసు లలో మేము ఏమి చెయ్యాలో నిర్ణయించుకొంటాము. రాబోయే రెండు వారాల్లో అనేక lawsuits ఫైల్ చేయబోతున్నాం.
TANA HELPLINE: 1-855-OUR-TANA | 1-855-687-8262
ATA
1-844-ATA-
SEVAatahelp@ataworld.org
NATS
Help Line: +1-888-4-TELUGU
(+1-888-483-5848)
MATA HELPLINE :
+1 888-7MATAUS | +1 (888) 762-8287








