ప్రపంచానికి గుడ్ న్యూస్ : ట్రంప్
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ పూర్తిగా అణ్వాయుధ పరీక్షలను నిలిపి వేయనున్నట్లు, అణ్వాయుధాలను నాశనం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ తెలపటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచానికి కిమ్ చెప్పి శుభవార్తగా అభివర్ణించారు. ట్రంప్-కిమ్ ఉత్తరకొరియా అణుకార్యక్రమాలపై చర్చించేందుకు ఈ నిర్ణయం మరింత దోహదపడుతుందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూన్ ట్రంప్ వెలువడిన వెంటనే ట్రంప్ ఆయనకు ఫోన్ చేసి 75 నిమిషాలకు పైగామాట్లాడారు. కొరియా ప్రాంతంలో అణ్వాయుధాలు పూర్తిగా నిర్మూలిస్తేనే ఆ ప్రాంతంలో శాంతికి స్థాపనకు మార్గం ఏర్పడుతుందని అన్నారు.













