ఉత్తర కొరియాలో చెల్లెమ్మకు పవర్!
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? కిమ్ స్థానంలో అతని సోదరి కిమ్ యో జాంగ్ పరిపాలన సాగిస్తుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. 36 ఏళ్ల కిమ్ ఆరోగ్యంపై సందేహాలు తలెత్తడం, ఈ ఏడాదిలో రెండోసారి. ఏప్రిల్‌లోనే కిమ్ మృతి చెందారని వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు రావడంతో ఆ వదంతులకు తెరపడింది. తర్వాత కిమ్ ఫొటోలను చాలానే విడుదల చేసింది ఉత్తర కొరియా. అయితే ఆ ఫొటోలన్నీ నకిలీవని, కిమ్ కోమాలో ఉన్నారని దక్షిణ కొరియా రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు దివంగత దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌కు రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మే చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఉత్తర కొరియా నియంత కిమ్ కోమాలోకి ఉన్నారని, ఈ విషయం చైనా నిఘా వర్గాల ద్వారా తనకు తెలిసిందని తెలిపారు. కిమ్ కోమాలో ఉన్నారని అనుకుంటున్నా. అతను ఇంకా మృతి చెందలేదు. అతను చనిపోతే ఎవరు బాధ్యతలు తీసుకోవాలన్న విషయంలో ఇంకా సృష్టత రాలేదు. ప్రస్తుతానికి ఆ శున్యాన్ని కిమ్ సోదరి యో జాంగ్‌తో భర్తీ చేస్తున్నారు అని చాంగ్ చెప్పారు. కోమలోకి వెళ్లేముందు కిమ్.. దక్షిణ కొరియా, అమెరికాతో సంబంధాలను పర్యవేక్షించే బాధ్యతలను తన సోదరి యో జాంగ్కే అప్పగించారని తెలుస్తోంది. మరో వైపు ఉత్తర కొరియాలో విస్త•తంగా పర్యటించిన పాత్రికేయుడు రాయ్ కేలీ మాత్రం.. కిమ్ మరణించారనే అంటున్నారు. ఉత్తరకొరియాలో అంతా రహస్యమేనని అక్కడేం జరుగుతుందో ఆ దేశ ప్రజలకు కూడా తెలియదన్నారు.













