GTA: జీటీఏ బతుకమ్మకు నార్త్ కరోలినాలో ప్రత్యేక గుర్తింపు

జీటీఏ రేలీ ఛాప్టర్ ఆధ్వర్యంలో జరగనున్న ‘జీటీఏ బతుకమ్మ’కు (GTA Bathukamma) అధికారిక గుర్తింపు దొరికింది. నార్త్ కరోలినా గవర్నర్ జోష్ స్టెయిన్ నుంచి జీటీఏ బతుకమ్మకు అధికారిక సర్టిఫికెట్ లభించింది. తెలంగాణ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా.. నార్త్ కరోలినా అభివృద్ధికి తెలుగు కమ్యూనిటీ అందిస్తున్న సహకారానికి దక్కిన గుర్తింపుగా దీన్ని జీటీఏ భావిస్తోంది. ఈ ఏడాది బతుకమ్మ (GTA Bathukamma) వేడుకలకు సిద్ధం అవుతున్న సమయంలో ఈ అత్యున్నత స్థాయి గుర్తింపు దొరకడం అద్భుతమైన విషయమని తెలుగు కమ్యూనిటీ అంటోంది.