మోడీ – ట్రంప్ భేటీలో ఆ ప్రస్తావనే లేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో భారతీయులకు, టెక్నాలజీ కంపెనీలకు ప్రధాన సమస్యగా ఉన్న హెచ్-1బీ వీసా విధానంపై క్లారిటీ వస్తుందని తెగ ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు మోదీ- ట్రంప్ భేటీలో హెచ్-1బీ వీసా సమస్యను ప్రస్తావించే ప్రణాళికలేమీ లేవని వైట్ హౌజ్ పేర్కొంది. ఈ విషయాన్ని తాము సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీలో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది. హెచ్-1బీ వీసా, విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే ప్లాన్స్ ఏమీ లేవు అని అడ్మినిస్ట్రేటివ్ సీనియర్ అధికారి చెప్పారు.













