2020లో మళ్లీ పోటీ చేస్తా
మరో రెండేండ్ల (2020)లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నన్ను కోరుకుంటున్నారు అని అన్నారు. తనను ఓడించేందుకు డెమొక్రటిక్ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్‌తో బ్రెగ్జిట్ అమలులో క్లిష్టమైన అంశాలపై చర్చించానని చెప్పారు. ఆమెతో నేను బ్రెగ్జిట్‌పై మాట్లాడా. ఆమె చాలా సరైన వ్యక్తి. ఆమె చాలా అద్భుతమైన వ్యక్తి. ప్రత్యేకమైన వ్యక్తి. బ్రెగ్జిట్ చాలా సంక్లిష్టమైన సమస్య. దాని సంక్లిష్టత ఎంత అన్నది ఎవరూ చెప్పలేరు అని ఆయన అన్నారు.













