హెచ్ 1బీ వీసాల జారీలో మార్పులు ఉండవు
హెచ్ 1బీ వీసాల జారీలో ఎలాంటి మౌలిక మార్పులూ ఉండబోవని అమెరికాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త సృష్టీకరించారు. భారత ఐటీ నిపుణుల్లో ఆందోళనను శాంతింపజేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ విషయంపై ముంబయిలోని అమెరికా కాన్సులేట్‌లో సీనియర్ అధికారి ఎడ్గార్డ్ డీ కాగన్ మాట్లాడారు. ఇక్కడి హెచ్1బీ వీసా ప్రక్రియాల్లో ఎలాంటి మార్పులూ లేవని ఆయన వివరించారు. హెచ్ 1బీ వీసాలతో భారతీయులే ఎక్కువ లబ్ధిపొందుతున్నారని మాకు తెలుసు. కానీ నిబంధనలను కఠినతరం చేస్తే వారికే మేలుజరుగుతుంది. వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని సంస్థలు ఇస్తాయి అని ఆయన చెప్పారు.













