హెచ్ 1 బీ జారీలో మార్పుల్లేవ్
హెచ్ 1బీ వీసాల జారీ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేయలేదని అమెరికా సృష్టం చేసింది. వచ్చేవారం ఢిల్లీలో భారత్, అమెరికా మధ్య జరిగే 2+2 చర్చల్లో వీసా అంశాన్ని ప్రస్తావించాలని భారత్ భావిస్తోంది. గత నెలలో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో మాట్లాడుతూ వీసాల అంశంపై ఇప్పటికే పలుమార్లు వైట్‌హౌస్‌తో చర్చలు జరిపామని, వేర్వేరు వేదికల పైనా ఈ సమస్యను ప్రస్తావనకు తెచ్చామని చెప్పారు. సెప్టెంబరు 6న జరిగే చర్చల్లో దీనిపై చర్చిస్తామన్నారు. చర్చల్లో వీసాల అంశాన్ని తీసుకొచ్చే ఏర్పాట్లలో భారత్ ఉందని, ఈ విషయంలో మార్పులు చేయనందున దీనిపై మాట్లాడటానికేమీ లేదని ట్రంప్ కార్యాలయ సీనియ్ అధికారి పేర్కొన్నారు.













