సిలికానాంధ్ర యూనివర్సిటీలో నిర్మలా సీతారామన్
కాలిఫోర్నియాలోని సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్పన్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన నిర్మలా సీతారామన్ వివిధ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థలు ఫెడెఎక్స్, మాస్టర్‌కార్డ్ సీఈవోలతో భేటీ అయ్యారు. యాక్సెంచర్ చీఫ్ జులీ స్వీట్, మాస్టర్ కార్డ్ సీఈవో మిబాచ్ మైకేల్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్‌తో సీతారామన్ సమావేశమయ్యారు.
కాలిఫోర్నియాలోని సిలికాన్ ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్పన్లో మాట్లాడుతూ డిజిటల్ కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీతో నియంత్రణ చేయాలని, కానీ నియంత్రణ కోల్పోతే దేశానికే సమస్య అని తెలిపారు. కొవిడ్ టైమ్ లో డిజిటల్ లావాదేవీలపై ఆదారపడ్డ వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ ఎంతో ముందుకు సాగిందన్నారు. డిజిటల్ బ్యాంకులు, డిజిటల్ కరెన్సీలను, డిజిటల్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలన్నారు. గ్లోబల్ యూనివర్సిటీల ఆవశ్యకత గురించి ఆమె మాట్లాడారు.













