కాల్పులు జరిపింది నేనే
ఫ్లోరిడాలోని మర్జోరీ స్టోర్మెన్ డగ్లస్ పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పు జరిపి, 17 మందిని చంపింది తానేనని పూర్వ విద్యార్థి నికోలస్ క్రూజ్ అంగీకరించారు. నిందితుడు ఓ న్యాయమూర్తి ముందు దృశ్యాత్మక విచారణకు హాజరయ్యారు. పాఠశాల నుంచి బహిష్కృతుడైన క్రూజ్, పూర్వాలోచితంగానే కాల్పులకు తెగబడ్డాడని విచారణాధికారులు నేరారోపణ చేశారు. అతనిపై మొత్తం 17 ఆరోపణలను నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే నిందితుడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని పేర్కొన్న న్యాయమూర్తి, జామీనుకు తావులేకుండా అతడిని జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించారు.













