డొనాల్డ్ ట్రంప్ తో నాకు అఫైర్ లేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ(46)తో అఫైర్ కొనసాగిస్తున్నరని వస్తున్న వదంతుల్ని హేలీ తీవ్రంగా ఖండించారు. విజయవంతమైన ఓ మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హేలీలో చాలాసేపు గడుపుతున్నారనీ మైకెల్ వుల్ఫ్ తన పుస్తకం ఫైర్ అండ్ వ్యూరీలో రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై స్పందించిన హేలీ తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌తో తన భవిష్యత్ గురించి చర్చంచలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని సృష్టం చేశారు.













