నికరాగ్వా అధ్యక్షుడు ఎక్కడ?
నికరాగ్యా అధ్యక్షుడు కనిపించడం లేదు. కరోనా మహమ్మారిపై చర్యలు చేపడుతున్న దాఖలాల్లేవు అంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. నికరాగ్యా అధ్యక్షుడు డేనియల్ ఒర్టేగా నెల రోజులుగా కనిపించడం లేదని పేర్కొంది. కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ ఆయన్ను ప్రజాసంబంధ కార్యక్రమాల్లో ఎక్కడా చూడలేదని తెలిపింది. ఆయన అనారోగ్యంతో చనిపోయారా లేక ప్రజలను కలవకుండా తప్పించుకుంటున్నారా అని దేశంలో చర్చించుకుంటున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో డేనియల్ ఒర్టేగా కనిపించడం లేదంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కథనం ప్రచురింది.













