న్యూయార్క్ లో 2 గంటలకు ఒక కేసు
ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక, వాణిజ్య నగరంగా పేరుగాంచిన న్యూయార్క్‌ను కరోనా కబళిస్తోంది. ఇక్కడి టైమ్స్ స్క్వేర్ శ్మశాన ప్రాంతాన్ని తలపిస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒక కరోనా కేసు నమోదుతో నగరాన్ని అత్యంత కల్లోల ప్రదేశంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సహాయక చర్యలకు ఆర్మీని రంగంలోకి దింపారు. హోటళ్లను మూసివేసి వాటిలోని 10 వేల గదుల్లో కరోనా బాధితులకు చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యం అందించడానికి అవకాశం ఉన్న కాలేజీలు, క్రీడా మైదానాలను సైన్యం గుర్తిస్తోంది. మైట్రో, ట్యూబ్ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. లక్షలాది తెలుగు కుటుంబాలుండే న్యూజెర్సీ, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు లేకపోవడం కొంత ఊరట. తెలుగు వారి కోసం తానా, నాట్స్, ఆటా హెల్ప్లైన్లు ఏర్పాటు చేశాయి.













