అమెరికా కొత్త ఆంక్షలు అర్ధరహితం
రష్యాపై అమెరికా విధించనున్న కొత్త ఆంక్షలు గతంలో మాదిరిగానే అర్ధరహితమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లాప్రోప్ వ్యాఖ్యానించారు. ఈ ఆంక్షలపై మేము హెచ్చరించం. కేవలం ఇవి అర్ధరహితమని మాత్రమే చెబుతాం. అంతకన్నా మాట్లాడడం అనవసరం. ఈ ఆంక్షల వెనుక లక్ష్యమేమిటన్నది అసృష్టంగా వుంది. ఈ ఆంక్షల వల్ల ఉపయోగమేమీ లేదని వారు అర్ధం చేసుకోలేకపోతే మేం చేయగలిందేమీ లేదు. విచారించడం తప్ప అని లాప్రోప్ వ్యాఖ్యానించారు. అమెరికా కొత్త ఆంక్షలను రష్యా ప్రతిఘటిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. మాస్కోపై మరింత కఠినమైన ఆంక్షలు విధించడానికి ట్రంప్ సర్కార్‌కు అధికారమిస్తూ ఈ నెల 13న అమెరికా సెనెటర్లకు చెందిన ద్వైపాక్షిక కమిటీ బిల్లును ప్రవేశపెట్టింది. రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌కి చెందిన 24 మంది ఏజెంట్లపై ఈ బిల్లు ఆంక్షలను విధించింది. నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై 24 మంది ఉక్రెయిన్ నావికులను రష్యా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనలో ఈ ఏజెంట్లకు సంబంధాలున్నాయన్నది అమెరికా ఆరోపణ.













