ఒక్కసారి నో చెబితే అంతే!
అమెరికాలో వీసా నిబంధనలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినం చేసింది. ప్రాథమిక ఆధారాలు లేకపోవడం, వీసాను కోరే అర్హతను చూపించలేకపోవడం వంటి కొన్ని పరిస్థితుల్లో దరఖాస్తులను తిరస్కరించే అధికారాన్ని అధికారులకే కల్పించింది. సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు హెచ్1 బీ ఉద్యోగులను స్పాన్సర్ చేసే కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. మరిన్ని పత్రాలను సమర్పించేందుకు, వివరణ ఇచ్చేందుకు వాటికి రెండో అవకాశం దాదాపు ఉండదు. ఒకవేళ హెచ్1బీ వీసా పొడిగింపు దరఖాస్తును తిరస్కరిస్తే, సదరు ఉద్యోగిని ఉన్న పళాన భారత్కు తిప్పి పంపే అవకాశాలూ ఎదురు కానున్నాయి.













