వేడి వాతావరణంతో చదువు దూరం
తరగతి గది పైకప్పు రేకుల షెడ్డు, క్లాసులో ఓవైపు ఉక్కపోత, మరోవైపు చికాకు పెట్టే చెమట ఇలాంటి వేడి వాతావరణంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందట. ఈ వాతావరణంలో చదవాలన్న ఆసక్తి రాకపోవడం, పాఠం చెబుతుంటే ఏకాగ్రత పెట్టకపోవడం లాంటి సమ్యల వల్ల పిల్లలు తక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశాలున్నాయని అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గదిలో 21 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే 0.55 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినా ప్రమాదమేనని తెలిపారు.













