ఎమ్ఆర్ఐ తో గుండె జబ్బుల గుర్తింపు
గుండె జబ్బులను గుర్తించడానికి మ్యాగ్నటిక్ రెసొన్యాన్స్ ఇమేజింగ్ (ఎమ్ఆర్ఐ)ను వాడవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఆరోగ్యవంతులకు, గుండెజబ్బులతో బాధపడుతున్న వారికీ ఎమ్ఆర్ఐతో గుండెవ్యాధులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో గుండె వ్యాధులకు మూల కారణం గుండె కండరాలకు సరైన రక్త ప్రసరణ జరగకపోవడమేనని అమెరికాలోని లాసోన్ హెల్త్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం గుండెకు రక్తప్రసరణకు కొలవడానికి అందుబాటులో ఉన్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే రేడియో యాక్టివ్ రసాయనాలతో కూడిన ఇంజెక్షన్ ఇవ్వాలని, కానీ ఎమ్ఆర్ఐ పద్ధతిలో ఈ తరహా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదని వారు తెలిపారు.













