అమెరికాలో దారుణం
అమెరికాలోని న్యూజెర్సీ బీచ్లో ఓ పోలీస్ అధికారి యువతిపై పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ పోలీస్ అధికారి తలపై బలంగా కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. 20 ఏళ్ల ఎమిలీ వీన్మూన్ అనే ఆ యువతిని బీచ్లో అక్రమంగా మద్యం కలిగి ఉన్నదన్న కారణంగా పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు వీన్మాన్పై దౌర్జన్యం చేశారు. బలవంతంగా ఆమె చేతులు, కాళ్లకు బేడీలు వేసి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ అయిపోయింది. అక్రమంగా మద్యం కలిగి ఉండటంతో పాటు పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించిన కారణంగా వీన్మాన్పై కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతిపై దౌర్జనం చేసిన పోలీసు అధికారులపై కూడా అంతర్గత విచారణకు ఆదేశించినట్లు వైల్డ్పుడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.













