హెచ్ ఐవీ నిరోధానికి త్వరలో సరికొత్త ఔషధం!
మానవాళి ప్రాణాలను హరిస్తున్న హెచ్ఐవీ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే సరికొత్త ఔషధం త్వరలో అందుబాటులోకి రానుంది. వైరస్ జనాభాను గణనీయంగా తగ్గించడంతో పాటు రోగ నిరోధక కణాల సంఖ్యను పెంచడం దాని విశిష్ట లక్షణం. వ్యాధి ముదిరిన రోగుల్లోనూ ఈ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. రోగనిరోధక కణాలైన సీడీ4 టీ-కణాల్లోకి హెచ్ఐవీ ప్రవేశించేందుకు దోహదపడే ప్రాథమిక రిసెష్టార్లను లక్ష్యంగా చేసుకొని ఇబలిజుమబ్ పనిచేస్తుందని తెలిపారు.













