TSN: నెబ్రాస్కా తెలుగు బడి నూతన విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ ఘన విజయం

ఒమాహా: తెలుగు సమితి అఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో గత శనివారం నిర్వహించబడిన తెలుగు బడి 2025–26 విద్యాసంవత్సర ప్రారంభోత్సవ సభ విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి 150 మందికి పైగా హాజరై, తెలుగు భాషపై తమకున్న అభిమానం మరియు మమకారాన్ని చాటుకున్నారు.
గత విద్యాసంవత్సరానికి లభించిన విశేష ఆదరణ ఆధారంగా నిర్వాహకులు ఈ సంవత్సరం 30 మంది పిల్లల చేరిక ఉంటుందని భావించినప్పటికీ, 60 మందికి పైగా పిల్లలు చేరడం నెబ్రాస్కా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.
ప్రముఖుల సందేశాలు
ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు తమ అనుభవాలు, స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందించారు:
Dr. ఫణి తేజ్ అడిదమ్ (UNO ప్రొఫెసర్, మాజీ హిందూ దేవాలయ చైర్మన్) – తెలుగు భాష, సంస్కారం, సాంప్రదాయం, భవిష్యత్ జ్ఞానం అన్నీ ఒక గొలుసు లాగా అనుసంధానమై ఉంటాయని వివరించారు.
Dr. చంద్రకాంత్ ఆరే (Vice Chair Education, UNMC Dept. of Surgery, CEO – Global Forum of Cancer Surgeons) – బహుభాషలు నేర్చుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను వివరించారు.
Dr. మురళీధర్ చింతపల్లి Vice President – Fiserv) – ఒమాహాలో తన తొలి అనుభవాలను పంచుకుంటూ, తెలుగు బడి మరియు TSN కార్యవర్గం సాధించిన పురోగతిని అభినందించారు.
మల్లికా జయంతి (నాట్య గురువు, గురుకులం సెంటర్ ఫర్ ఇండియన్ ఆర్ట్స్ CEO) – భాష, కళలు, సంప్రదాయాలు, సంస్కృతుల అనుబంధాన్ని హృద్యంగా వివరించారు.
రాజా కోమటిరెడ్డి (TSN అధ్యక్షులు) – పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుగు బడి ద్వారా పొందే లాభాలను స్పష్టం చేశారు.
కొల్లి ప్రసాద్(TSN ఉపాధ్యక్షుడు) – TANA పాఠశాలతో భాగస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠ్య ప్రణాళిక ఆవిష్కరణపై వివరిస్తూ, సభలో పాల్గొన్నవారి నుండి విశేష ఆదరణ పొందారు.
కార్యక్రమంలో శ్రీ భాను TANA పాటశాల చైర్మన్, శ్రీ తోటకూర ప్రసాద్ మరియు శ్రీ సుందర్ చూకర ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి.
ఉపాధ్యాయుల పరిచయం
కార్యక్రమంలో తెలుగు బడి ఉపాధ్యాయులు — శ్రీ వేణుగారు, శ్రీమతి దివ్య ముఖ్క, శ్రీమతి పవిత్ర, శ్రీమతి స్వప్న, శ్రీమతి వీణా మాధురి, శ్రీ సుధీర్ లంక — అధికారికంగా పరిచయం చేయబడ్డారు. అనంతరం వారు తల్లిదండ్రులు, పిల్లలకు తమను తాము పరిచయం చేసుకున్నారు.
అలాగే, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు పిల్లలతో ప్రశ్నోత్తర సెషన్ నిర్వహించగా, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా TANA పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన పాఠ్య ప్రణాళిక అందుబాటులో ఉండటం వారికి విశేషంగా ఆనందాన్నిచ్చింది.
సభ విజయవంతం
సభ విజయవంతం కావడానికి సహకరించిన TSN కార్యవర్గం, అతిథులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా ఆర్జే ఝాన్సీ సమన్వయం, ఆకర్షణీయమైన నిర్వాహణతో కార్యక్రమానికి విశేష అందాన్ని చేర్చారు.
కొల్లి ప్రసాద్ గారు మరియు TSN కార్యవర్గం తరఫున TANA నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా రాజా కసుకర్తి గారు, భాను మగులూరి గారు మరియు TANA అధ్యక్షులు నరేన్ కొడాలి గారికి నెబ్రాస్కా తెలుగు బడి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రారంభం నుండి ముగింపు వరకు అహర్నిశలూ శ్రమించి విజయవంతం చేయడంలో భాగస్వామ్యం చేసిన శ్రీ Thata Rao, శ్రీ సాంబా, శ్రీ రమేష్, శ్రీ అనిల్, శ్రీ వేణు మురకొండ, శ్రీ వీరు ముప్పారాజు, శ్రీ పవన్ గార్లకు ప్రత్యేక అభినందనలు లభించాయి. వారి కృషిని రాజా కోమటిరెడ్డి గారు సభలో ప్రత్యేకంగా ప్రశంసించారు.