ఈబీ-5 వీసాలకు డిమాండ్
అమెరికాలో స్థిరనివాసం కోసం భారతీయులు ఈబీ-5 వీసాల కోసం పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. గత రెండేళ్లలో సుమారు నాలుగు రేట్లు పెరిగాయి. క్యాష్ ఫర్ గ్రీన్ కార్డుకు రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతోందని అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. సెప్టెంబర్‌తో 2018తో ముగిసిన 12 నెలల కాలలో సుమారు 585 షరతులతో కూడిన గ్రీన్‌కార్డులను జారీ చేయడం జరిగింది. అంతకు ముందు 2017లో 174 గ్రీన్‌కార్డులను, 2016లో షరతులతో కూడిన 149 గ్రీన్ కార్డులను జారీ చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి చూస్తే గ్రీన్‌కార్డుల జారీ ఏకంగా 293 శాతం పెరిగింది.
ఈ గ్రీన్‌కార్డుల వీసాలు దక్కించుకోవడంలో చైనా, వియత్నాంలు 2018లో అగ్రస్థానంలో ఉంటే భారత్ దక్షిణి కొరియా, తైవాన్లను వెనక్కి నెట్టి ప్రస్తుతం భారత్ మూడవ స్థానం అక్రమించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి వందలాది మంది భారతీయులు, వారిలో ఇప్పటికే అమెరికాలో పనిచేస్తున్న వారు కూడా ఈబీ-5 వీసాకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ వీసా విషయానికి వస్తే అమెరికాలో సుమారు మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడమో లేదా కనీసం పది మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుది. కొన్ని వ్యాపారాలకు ఉద్యోగులను తీసుకొనే దాన్ని బట్టి పెట్టుబడులకు 5 లక్షల డాలర్లకు పరిమితం చేశాయి. ఉపాధి ఎక్కువగా కల్పించే రంగాల్లో పెట్టుబడులు పెడతే వారికి గ్రీన్‌కార్డు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి భారతీయులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నిబంధనలన్నీ తూచ తప్పకుండా పాటిస్తే శాశ్వత నివాసం కూడా లభిస్తుంది.













