అమెరికా నౌకాదళాధిపతి పై వేటు
అమెరికా నౌకాదళ అధిపతి రిచర్డ్ స్పెన్సర్‌పై వేటు పడింది. దుష్ప్రవర్తన కారణంగా ఆయనను తొలగించినట్లు రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ పేర్కొన్నారు. నేవీ సీల్స్కు చెందిన ఎడ్వర్డ్ గల్లాఘేర్ 2017లో ఇరాక్‌లో విధుల నిర్వహణ సందర్భంగా పౌరులపై కాల్పులు, అదుపులో ఉన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని హతమార్చడం, మృతదేహంతో సెల్ఫీ దిగడం వంటి యుద్ద నేరాలకు పాల్పడ్డారు. మృతదేహంతో సెల్ఫీ దిగిన కేసుకు సంబంధించిన ఎడ్వర్డ్‌కు మద్దతుగా నిలిచిన రిచర్డ్ స్పెన్సర్, రక్షణ శాఖకు బదులుగా నేరుగా వైట్‌హౌస్‌తో సంప్రదింపులు జరిపారు. ట్రంప్ క్షమాభిక్ష కారణంగా ఎడ్వర్డ్ తక్కువ శిక్షతో బయటపడ్డారు.
ఈ కేసులో రిచర్డ్ స్పెన్సర్ ప్రవర్తనపై రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ మండిపడ్డారు. తన విశ్వాసం కోల్పోయినందున తక్షణం రాజీనామా చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో రిచర్డ్ స్పెన్సర్‌ను రక్షణ మంత్రి మార్క్ ఎస్కెర్ తొలగించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నార్వేలో అమెరికా రాయబారిగా ఉన్న కెన్నెత్ బ్రైత్‌వైట్ ఆయన స్థానంలో నియమించినట్లు పేర్కొన్నారు.













