NATS: నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రండి.. ప్రముఖులకు నాట్స్ బృందం ఆహ్వానాలు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే 8 వ నాట్స్(NATS) అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ పలువురు ప్రముఖులను నాట్స్ బృందం ఆహ్వానించింది. జూలై 4,5,6 తేదీల్లో టంపా(Tampa) వేదికగా జరిగే తెలుగు సంబరాల్లో పాలుపంచుకోవాలని కోరింది. పద్మభూషణ్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలిజిస్ట్ డి. నాగేశ్వరరెడ్డి, ప్రముఖ కీళ్ల వైద్య నిపుణులు గురవారెడ్డి, ప్రముఖ కంటి వైద్య నిపుణులు కాసు ప్రసాద్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్తలు స్వప్నకుమార్, ప్రసాద రావు, గ్లో సంస్థ ప్రతినిధి వెంకన్న చౌదరి తదితరులకు నాట్స్ బృందం సభ్యులు ఆహ్వాన పత్రికలు అందించారు. అలాగే మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మహా టీవీ వంశీ లకు సంబరాలకు ఆహ్వాన పత్రికలు అందించి సంబరాలకు రావాలని కోరింది.
ప్రముఖులను ఆహ్వానించిన నాట్స్ బృందంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, తదితరులు పాల్గొన్నారు.
నాట్స్ ఇండియా లైజనింగ్ మనోహర్ కిలారు కూడా నాట్స్ బృందం లో ఉన్నారు.







