NATS: నాట్స్ సంబరాల్లో కాసు ప్రసాదరెడ్డి, గురవారెడ్డికి అవార్డుల ప్రదానం
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) నాట్స్ 3 రోజుల అమెరికా తెలుగు సంబరాలు నిన్న జులై 4న బాంక్వెట్ డిన్నర్ తో అదుర్స్ అనేలా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటలకు నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగువారు, ఇండియా నుంచి వచ్చిన అతిథుల రాకతో టాంపా కన్వెన్షన్ సెంటర్ వేదిక ప్రాంగణం శోభాయమానంగా తయారయ్యింది. బాంక్వెట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో సేవలందించిన అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో ప్రముఖ డాక్టర్‌గా పేరు పొందిన మ్యాక్సీ విజన్ అధినేత డాక్టర్ కాసు ప్రసాద రెడ్డి ని వేదికపైకి ఆహ్వానించి అవార్డును బహుకరించారు. అలాగే హైదరాబాద్‌లోని కిమ్స్ – సన్ షైన్ హాస్పిటల్ మేనెజింగ్ డైరెక్టర్, సర్జన్ డాక్టర్ గురవారెడ్డి కి నాట్స్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వేదికపై పలువురు నాట్స్ నాయకులు నిల్చుని అవార్డు గ్రహీతలను అభినందించారు.







