NATS: న్యూజెర్సీలో దిగ్విజయంగా నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్

అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ న్యూజెర్సీలో పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్ లో 37 టీమ్స్ పోటీ పడ్డాయి. దాదాపు 1000 మంది ఆటగాళ్ళు ఇందులో తమ ఆట తీరు చూపెట్టేందుకు పోటీపడ్డారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి చొరవతో న్యూజెర్సీ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌కు అటు ఆటగాళ్ల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నాట్స్ న్యూజెర్సీ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ సురేంద్ర పోలేపల్లి ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అలాగే నాట్స్ కో ఆర్డినేషన్ టీం నుంచి ప్రసాద్ టేకి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఇమ్మిగ్రేషన్ అధ్యక్షులు రాకేశ్ వేలూరు,
నాట్స్ మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ న్యూజెర్సీ నాయకులు వంశీ వెనిగళ్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేశారు. తెలుగు వారిని కలిపే ఆటలైనా, సంబరాలైనా నిర్వహించడానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు.
నాట్స్ తెలుగు వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని శ్రీహరి మందాడి అభినందించారు. ఈ టోర్నమెంట్‌లో విజేతలకు నాట్స్ నాయకులు బహుమతులు అందచేశారు. నాట్స్ న్యూజెర్సీ విభాగం దిగ్విజయంగా పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.