NATS: నాట్స్ ఆధ్వర్యంలో ఫ్రీ యోగా, మెడిటేషన్ వర్క్‌షాప్

బిజీ జీవితంలో అలసిపోయిన వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఉచితంగా ఆన్‌లైన్ యోగా వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా అంతర్జాతీయ సర్టిఫికెట్ ఉన్న మైత్రేయి ఆధ్వర్యంలో ఈ యోగా వర్క్‌షాప్ జరగనుంది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల (ఈఎస్‌టీ)కి ఈ వర్క్‌షాప్ మొదలవుతుంది. ఈ ట్రైనింగ్‌లో సూక్ష్మ వ్యాయామం, ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్, యోగ నిద్ర, ఫ్లెక్సిబిలిటీ, బలం, బ్యాలెన్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు నాట్స్ తెలిపింది. నాట్స్ లైఫ్ మెంబర్లు, కమ్యూనిటీ సభ్యులకు ఉచితంగా నాట్స్ (NATS) అందిస్తున్న ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనాలని అనుకునే వారు www.natsworld.org/nats-yoga లింకులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.