NATS: యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయను సత్కరించిన నాట్స్
తనదైన స్టైల్‌తో తెలుగు చిత్రపరిశ్రమపై ముద్ర వేసిన యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయను నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ఘనంగా సత్కరించారు. ‘బ్రోచేవారెవరురా?’ చిత్రంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వివేక్.. ఆ తర్వాత ‘అంటే సుందరానికి’ వంటి క్లాసిక్ చిత్రంతో ఆకట్టుకున్నారు. తాజాగా నానితో వివేక్ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ ఏ స్థాయిలో ఆడిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాట్స్ సభ్యులు గంగాధర్, శ్యామ్ మద్దాలి, శేఖర్, విజయ్ తదితరులంతా కలిసి కరతాళ ధ్వనుల మధ్య వివేక్ ఆత్రేయను సన్మానించారు.







