విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు నాట్స్ సాయం
100 కుటుంబాలకు ఆహారం అందించిన నాట్స్
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ .. తెలుగునాట కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా విశాఖలోని స్టెరైన్ గ్యాస్ లీక్ బాధితులకు తన వంతు సాయం చేసింది. దాదాపు 100 కుటుంబాలకు నాట్స్ ఆహారాన్ని అందించింది. గ్యాస్ లీక్ బాధిత గ్రామాల్లో పరిస్థితిని తెలుసుకున్న నాట్స్ నాయకత్వం వెంటనే అక్కడ ముందుగా బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. నాట్స్ ఇండియా కో ఆర్డినేటర్ సూర్యదేవర రామానాయుడు… స్థానిక బిర్యానీస్ అండ్ మౌర్ రెస్టారెంట్ సహాకారంతో బాధితులకు ఆహారాన్ని పంపిణి చేశారు. నాట్స్ నాయకులు సూర్య ఈ పంపిణీలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే నాట్స్ లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు పలు ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఆహారాన్ని అందిస్తూ వస్తోంది.













