NATS: సీనియర్ నటి జయసుధకు నాట్స్ వేదికపై ఘనసత్కారం
తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు అందరితో కలిసి నటించిన జయసుధ (Jayasudha) గారెని నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులంతా కూడా లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో మాట్లాడిన జయసుధ.. నాట్స్ సంబరాల ద్వారా అందర్నీ కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సీనియర్ నటి మీన, యంగ్ హీరోయిన్ శ్రీలీల తదితరులందరినీ పలకరించారు. తనను ఇలా సత్కరించిన నాట్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.







