NATS: నాట్స్ వేదికపై పారుపల్లి రంగనాథ్‌కు ఘనసత్కారం
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఎన్నో సేవలు చేసిన ప్రముఖ కంపోజర్, సింగర్ పారుపల్లి రంగనాథ్ గారిని నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ఘనంగా సత్కరించారు. ఆయన ‘శ్రీనివాసా గోవిందా.. శ్రీవెంకటేశా గోవిందా..’ అంటూ ఆయన పాడిన గోవింద నామాలు ఇప్పటికీ చాలా పాపులర్. ఇప్పటికీ ఆలయాల్లో, ఇళ్లలో వినిపించే కంఠం ఆయనదే. 1981లో టీటీడీ ఆస్థానంలో చేరి, దాదాపు 900 అన్నమయ్య కీర్తనలను తాను కంపోజ్ చేశానని, వీటి కన్నా ముందు ‘గోవింద నామాలు’ కంపోజ్ చేసి పాడానని అన్నారు. 1986లో రేవతి రాగంలో ఈ గానం చేసి శ్రీవారికి అంకితం ఇచ్చానన్నారు. నాట్స్ వేడుకల్లో భాగంగా జరిగిన కల్యాణోత్సవంలో కూడా ఆయన శ్రీవారి కీర్తనలతో అలరించారు. తనకు ఈ అవకాశం కల్పించిన నాట్స్‌కు రంగనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు.







