NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…

న్యూ జెర్సీ లో, ఎడిసన్ పట్టణంలో నివసించే దాము గేదెల గురించి తెలియని తెలుగువారు ఉండరు. అలాగే దాము గేదెల పని చేయని తెలుగు సంఘం కూడా లేదు. గత 40 సంవత్సరాలుగా శ్రీ దాము గేదెల అన్ని జాతీయ తెలుగు సంఘాలకు తన సేవలు అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కూడా న్యూ జెర్సీ తెలుగు సంఘం ( TFAS) లో, న్యూ జెర్సీ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన అమెరికా తెలుగు అసోసియేషన్ ( MATA), ఎడిషన్ పట్టణం లో వున్న శ్రీ సాయి దత్త పీఠం లో దాము గేదెల కనిపిస్తూనే వుంటారు.
జూలై 4- 6 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరిగిన 8 వ నాట్స్ తెలుగు సంబరాలు లో నాట్స్ ( NATS) వారు శ్రీ దాము గేదెల చేసిన సేవలు గుర్తిస్తూ వేదిక మీద కు పిలిచి గౌరవించి మోమెంటో ఇవ్వవలసి ఉన్నది. ఆరోజు హీరో బాల కృష్ణ, ఇతర కార్యక్రమాల వలన, సమయం చాలక, శ్రీ దాము గేదెల సన్మానం వాయిదా పడింది.
నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి మరియు నాట్స్ ఇతర నాయకులు న్యూ జెర్సీలో జరిగిన ఒక కార్యక్రమం లో శ్రీ దాము గేదెల ను ఆహ్వానించి, అందరి సమక్షంలో సన్మానించి గౌరవించారు.
ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి, పూర్వ అధ్యక్షులు గంగాధర్ దేశు, మురళి మేడిచెర్ల, హరి ఎప్పన్నపల్లి, సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు రఘు శంకరమంచి తదితరులు శ్రీ దాము గేదెల ను ప్రసాదిస్తూ అభినందనలు తెలిపారు.