ఆసుపత్రులకు సర్జికల్ మాస్కులు అందించిన శ్యామ్ మద్దాళి
అమెరికాలో రోజురోజుకి కరోనా వైరస్ వైద్యులను కూడా భయపెడుతోంది. ఈ క్రమంలో వైద్యుల రక్షణ కోసం నాట్స్ మాజీ చైర్మన్ శ్వామ్ మద్దాళి స్పందించి, న్యూజెర్సీలోని స్థానిక ఆసుపత్రులకు సర్జికల్ మాస్కులను ఉచితంగా అందించారు. వైద్యుల రక్షణకు ఈ మాస్కులు ఎంతగానో దోహాదం చేస్తాయి. సర్జికల్ మాస్కుల కొరత తీవ్రంగా ఉన్న ఈ సమయంలో శ్యామ్ మద్దాళి మానవత్వంతో ముందుకొచ్చి చేసిన సాయానికి రాబర్ట్ వుడ్ జాన్సన్ యూనివర్సిటీ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ పాయల్ పారిక్ శ్యామ్ మద్దాళికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పాయల్ పారిక్ స్వయంగా వచ్చి మాస్కులను తీసుకెళ్లారు. ఇలానే స్థానికంగా ఉండే మరో సెయింట్ పీటర్ యూనివర్సిటీ హాస్పిటల్ కు శ్యామ్ మద్దాళి సర్జికల్ మాస్కులను ఉచితంగా అందించారు. మరోవైపు నాట్స్ పిలుపు మేరకు న్యూజెర్సీ సాయి దత్త పీఠం నుంచి ఐదుగురు మహిళలు సర్జికల్ మాస్కులు కుట్టి ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు.













