గుంటూరు జిల్లాలో నాట్స్ దాతృత్వం
200 మంది పేద కుటుంబాలకు నిత్యా
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. ఇటు తెలుగునాట కూడా లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉదారంగా ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ గుంటూరు జిల్లాలోని వేటపాలెం, కొత్తపల్లి, నారికేళ్లపల్లి గ్రామాల్లో 200 పేద కుటుంబాలకు నాట్స్ నిత్యావసరాలను పంపిణీ చేసింది.
నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని స్వగ్రామమైన వేటపాలెం లో 150 కుటుంబాలకు నాట్స్ సహాయం చేసింది. వేటపాలెం గ్రామ నాయకులు అప్పసాని రాజేష్, రావిపాటి బాబు, రావిపాటి వెంకటేశ్వర రావు ల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.






