ఎంవీవీఎస్ మూర్తి మృతిపట్ల నాట్స్ సంతాపం
గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతిపట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎంవీవీఎస్ మూర్తి, బసవ పున్నయ్య, శివరామకృష్ణ, వీబీఆర్ చౌదరి కుటుంబాలకు నాట్స్ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రమాదంలో మరణించిన నలుగురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయ్యిందని నాట్స్ వెల్లడించింది. లాస్ఎంజెల్స్ నుచి శ్రీనివాస్ చిలుకూరిని, సియాటెల్ నుంచి దేవినేని శ్రీధర్‌ను అలస్కాలోని యాంకరేజ్ ప్రాంతానికి పంపింది. మూర్తి సహా అందరి మృతదేహాలను నేడు అర్థరాత్రి వరకు విశాఖకు తరలిస్తామని నాట్స్ ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉంటే, తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) కూడా ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల సంతాపం తెలిపింది. ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించడానికి నాట్స్‌తో పాటు తానా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.













