డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తప్పదా?
ఐఎస్ అధినేత అల్ బగ్దాదీని వేటాడి చంపేశామంటూ ఆర్భాటంగా ప్రకటించి రాజకీయంగా మార్కులు కొట్టేశామని సంబరపడ్డ డొనాల్డ్ ట్రంప్‌కు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనడానికి తనకు సాయపడాల్సిందిగా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీని కోరిన మాట మూమ్మాటికీ నిజమని అమెరికా జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ)కి చెందిన సీనియర్ ఉద్యోగి అలెగ్జాండర్ విండ్మన్ ధ్రువీకరించారు. జూలై 25న ఆ ఫోన్‌కాల్ చేశారు. పక్కనే సిట్యుయేషన్ రూమ్‌లో నేను ఉన్నాను. నాతో పాటు ఇతర ఎన్ఎస్సీ అధికారులు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సిబ్బంది కూడా ఆ ఫోన్‌కాల్ విన్నాం. 400 మిలియన్ డాలర్ల సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. కానీ అంతకుముందు మీరు నాకో సాయం చేసిపెట్టాలి అని ట్రంప్ ఆయనను కోరారు అని విండ్మన్ వాంగ్మూలంలో పేర్కొన్నారు.













