ఆధారాలతో చైనా ముందుకు రావాలి
ప్రాణాంతక కరోనా వైరస్ను ఎక్కడ, ఎలా అభివృద్ధి చేశారో అసలైన ఆధారాల తో చైనా ముందుకు రావాలని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్డ్ ఓబ్రియెన్ డిమాండ్ చేశారు. కొవిడ్ -19 మహమ్మారితో వ్యవహరించడానికి సంబంధించి ప్రస్తుతం ఆ దేశంపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి నెలకొందని చెప్పారు. విదేశాల నుంచి వ్యాధి నియంత్రణ నిపుణుల బృందం వచ్చి పరిశీలిస్తామంటే చైనా తిరస్కరించింది. అందుకే వైరస్ ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాల్సిన భారం చైనా పైనే పడింది. వాళ్లు ఏం చేస్తారో చూడాల్సి ఉంది అని అమెరికా రేడియో వ్యాఖ్యాత హగ్ హెవిట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓబ్రియెన్ చెప్పారు.













