నాట్కో ఫార్మాకు ఊరట
హైదరాబాద్ సమీపంలోని నాట్కో ఫార్మా కొత్తూరు యూనిట్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ), ఈఐఆర్ (ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్) జారీ చేసింది. ఈ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ బృందం గత నెల 2-6 మధ్యకాలంలో ప్రి-అప్రూవల్ తనిఖీ నిర్వహించింది. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా తనిఖీ విజయవంతంగా పూర్తయిందని నాట్కో తెలిపింది.













