నాటా సూపర్ సింగర్ పోటీలు…
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో సూపర్ సింగర్ 2020 పోటీలను ఇటీవల ప్రారంభించారు. ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్ ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. రౌండ్ 1, రౌండ్ 2, ఫైనల్ విభాగాలుగా పోటీలను వర్గీకరించారు. ఫైనల్ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి 1000 డాలర్లు, 2వ బహుమతి 500 డాలర్లు, 3వ బహుమతి 250 డాలర్లుగా ఇవ్వనున్నారు. జూలై 4వ తేదీన ఫైనల్ పోటీలను నిర్వహించారు. నాటా సూపర్ సింగర్ సెమిఫైనల్లో ఎంతోమంది పోటీ పడ్డారు. అందులో నుంచి 6 గురిని చంద్రబోస్ సెలెక్ట్ చేశారు. జూలై 4వ తేదీన గ్రాండ్ ఫైనల్ పోటీలను నిర్వహించారు.
అనన్య పెనుగొండ (వర్జీనియా), లాస్య ధూళిపాల (వాషింగ్టన్), మైనా ఈదుల (నార్త్ కరోలినా), సాయి సృజన కొక్కెరగడ్డ (ఒహాయో), శశాంక (వర్జీనియా), స్రవంతి చింతకుంట (పెన్సిల్వేనియా) ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. ఫైనల్ పోటీల్లో ప్రథమ బహుమతి వర్జీనియాకు చెందిన శశాంకకు లభించింది. ద్వితీయ బహుమతి వాషింగ్టన్కు చెందిన లాస్య ధూళిపాలకు, తృతీయ బహుమతి వర్జీనియాకు చెందిన అనన్య పెనుగొండకు లభించింది.













