గద్వాలలో నాటా సేవా కార్యక్రమాలు
నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) మాతృరాష్ట్రంలో సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గద్వాలలోని విద్యార్థులకు 50 సైకిళ్లు, పది ల్యాబ్ట్యాప్ లను ఇటీవల పంపిణీ చేశారు. పట్టణంలోని తేరు మైదానంలో ఎమ్మెల్యే డీకే అరుణ చేతుల మీదుగా వీటిని విద్యార్థినులకు అందించారు. అంతకుముందు ఎంఎఎల్డీ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలో క్రికెట్ అభివృద్ధి కోసం రూ.3 లక్షల నగదు, రూరల్ క్రికెట్ అభివృద్ధికి రూ.లక్ష అందజేశారు. కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, నాటా సభ్యులు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్ తొలిసారిగా తెలంగాణలోని గద్వాలలో చేయూత అందించడానికి ముందుకు వచ్చింది.













