నాటా అధ్యక్షుడిగా హరినాథ్ రెడ్డి వెల్కూర్
అమెరికాలో జాతీయ తెలుగు సంఘాల్లో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అధ్యక్షునిగా హరినాథ్ రెడ్డి వెల్కూర్ బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా రామిరెడ్డి ఆళ్ల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నారాయణ రెడ్డి గండ్ర, కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి ఈమని, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాసులు రెడ్డి కొట్లూరు, కోశాధికారిగా శ్రీకాంత్ పెనుమాడ, సంయుక్త కోశాధికారిగా రాధాకృష్ణా రెడ్డి కలువాయితోపాటు పలువురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బాధ్యతలు చేపట్టారు. గత వారాంతం లాస్ వేగాస్లో నిర్వహించిన బోర్డు సమావేశంలో కొత్తకార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి కార్యవర్గం నుంచి బాధ్యతలు స్వీకరించారు.
2024-2027 కాలానికి బోర్డు సభ్యులుగా అట్లాంటా నుంచి శ్రీనివాసులు రెడ్డి కొట్లూరు, మాధవి ఇందుర్తి మరియు వెంకట్ దుగ్గిరెడ్డి ఎన్నికయ్యారు. అలాగే కమ్యూనిటీ సర్వీస్ ఛైర్ గా రాజేష్ తడికమళ్ల సేవలందించనున్నారు. రెండు రోజులపాటు లాస్ వేగాస్లో నిర్వహించిన బోర్డు సమావేశం అనంతరం నాటా ఫౌండర్ డా. ప్రేమ్ సాగర్ రెడ్డి, డా. రాఘవరెడ్డి గోసల, డా. ఆదిశేషారెడ్డి బెల్లం వంటి పెద్దల సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యుల మరియు బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. అమెరికా నలుమూలల నుండి నాటా నాయకులు ఈ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు.







