నాటా 2020 సాహిత్య పోటీలు
నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) వారి ఆధ్వర్యం లో నాటా 2020 సాహిత్య పోటీలు పేరుతో కథలు, కవితలు, కార్టూన్లు పోటీ నిర్వహించుచున్నది. మీ రచనలు పంపించాల్సిన గడువు: జూలై 31, 2020 మరిన్ని వివరాలకు మరియు రిజిస్ట్రేషన్:: https://www.nataus.org/rachanalu2020
• ఈ పోటీ లో మూడు విభాగాలు (కథలు, కవితలు, కార్టూన్లు) ఉంటాయి
+ కథల పోటీ: 5 ఉత్తమ కథలు – ఒక్కొకటికి పదిహేను వేల రూపాయలు లేక రెండు వందల డాలర్లు
+ కవితల పోటీ: 5 ఉత్తమ కవితలు
– ఒక్కొకటికి ఏడు వేల ఐదు వందల రూపాయలు లేక వంద డాలర్లు
+ కార్టూన్ల పోటీ: 5 ఉత్తమ కార్టూన్లు
– ఒక్కొకటికి మూడు వేల ఐదు వందల రూపాయలు లేక యాభై డాలర్లు
• ఒక విభాగం లో ఒక ఎంట్రీకి మించి పంపరాదు
• రచనలు తెలుగు జీవితానికి దగ్గరగా వుండాలి. ప్రయోగాత్మక రచనలకు ప్రాధాన్యం!
• కథలు ఐదు పేజీలకు, కవితలు రెండు పేజీలకు మించకూడదు
• బహుమతి పొందిన రచనలన్నీటిపైనా హక్కులు “నాటా” వారివే
• రచనలు ఇంకెక్కడా ప్రచురితమై వుండరాదు
• తమ స్వంత రచనలనే పోటీకి పంపాలి
• PDF లేదా Word ఫార్మాట్ లో వుండాలి, Unicode font మాత్రమే వాడాలి
• ఈ అవకాశం ప్రపంచంలో వున్న తెలుగు వారందరికీ !
• రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, అమెరికాలోనూ వున్న ప్రసిద్ధ రచయితలూ, కవులూ, పాఠకులూ న్యాయ నిర్ణేతలుగా వుంటారు
– వచ్చిన రచన లలో కొన్నింటిని నాటా సౌవెనీర్ లో ప్రచురించే అవకాశం ఉంటుంది
నియమ నిబంధనలు: https://www.nataus.org/rachanalu2020rules.pdf
ఈ-చిరునామా: rachanalu@nataus.org













