అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం
మాజీ రాష్ట్రపతి, విఖ్యాత శాస్త్రవేత్త దివంగత అబ్దుల్ కలాంకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తనదైన శైలిలో నివాళులర్పించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తమ శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ నూతన జీవికి కలాం పేరు మీదుగా నామకరణం చేసింది. బ్యాక్టీరియా రకానికి చెందిన సదరు జీవి భూమిపై ఎప్పుడూ కనిపించలేదు. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ప్రయోగశాల (జేపీఎల్) శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్ ఫిల్టర్లపై ఈ నూతన జీవిని తొలిసారిగా గుర్తించారు.ఏరోస్పేస్ రంగంలో కలాం సేవలకు గుర్తింపుగా ఆ బ్యాక్టీరియంకు సొలిబాసిల్లస్ కలామైగా నామకరం చేసినట్లు జేపీఎల్ సీనియర్ శాస్త్రవేత్త కస్తూరీ వెంకేటశ్వరన్ వెల్లడించారు.













