నాసా హ్యూమన్ స్పేస్ ప్లైట్ చీఫ్ రాజీనామా
నాసా మానవ అంతరిక్ష విమానాల చీఫ్ డౌగ్ లొవర్రో తన పదవికి రాజీనామా చేసినట్టు స్థానిక మీడియా పేర్కొంది. అలాగే నాసా డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్, మాజీ వ్యోమగామి అయిన కెన్ బోవర్యాక్స్ ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్గా వ్యవహరిస్తారని పేర్కొంది. అయితే తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని లొవర్రో పేరొకన్నారని, 2024లో చంద్రునిపైకి వ్యోమగాములను పంపే షెడ్యూల్ గురించి ఆయన వ్యాఖ్యానించలేదని అన్నారు. ఆ ఎంపికలో తాను పొరపాటు చేశానని సృష్టంగా తెలుస్తుందనీ, దాని భవిష్యత్ పరిణామాలను తాను మాత్రమే భరించాల్సి వుంటుందని లొవర్రో తన లేఖలో పేర్కొన్నారు. 2024 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి పంపాలన్న నాసా పరిశోధనలకు చీఫ్గా లొవర్రో గత అక్టోబర్ నుంచి చీఫ్గా వ్యవహరిస్తున్నారు.













