కళ్లు చెదిరే ఫొటోలు తీసిన జునో
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా పంపిన జునో స్పేస్‌క్రాఫ్ట్ గురు గ్రహానికి చెందిన అద్భుతమైన ఫొటోలను తీసింది. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహమైన జూపిటర్ కక్ష్యలోకి చేరినప్పటి నుంచి అక్కడి విశేషాలను జునో అందిస్తూనే ఉన్నది. జునో కారణంగా ఏడాది కాలంగా గురు గ్రహానికి సంబంధించి విప్లవాత్మకమైన విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా గురు గ్రహ వాతావరణానికి చెందిన ఓ కళ్లు చెదిరే ఫొటోను జునో తీసింది. దీనిని నాసా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటో తీసిన సమయంలో జూపిటర్కు చాలా దగ్గరగా జునో ఉంది. గురు గ్రహానికి ఉత్తర దిక్కుగా 13345 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆ గ్రహంపై ఉన్న మేఘాల కలర్‌ఫుల్ ఫొటోను జునో తీసింది. గతేడాది డిసెంబర్ 16న ఈ ఫొటో తీసినట్లు నాసా వెల్లడించింది.













