డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నాడు. మోడీ ప్రస్తుతం జీ-7దేశాల భేటీలో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. జీ-7 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆహ్వానం మేరకు మోదీ సదస్సుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంతో మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. భారత్‌లో అమెరికా వస్తువులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్ మోడీని కోరనున్నట్లు అధికారుల నుంచి అందుతున్న సమాచారం. తమ వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని ట్రంప్ కోరనున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం నేడు (26వ తేదీ మధ్యాహ్నం 3:45 గంటలకు) ఈ భేటీ జరగనుంది. ఇరువరి నేతల మధ్య 40 నిమిషాల పాటు చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.













