తానా ఎన్నికలు… నరేన్ కొడాలి ప్యానెల్ విజయం
తానా 2023 ఎన్నికల ఫలితాల్లో నరేన్ కొడాలి ప్యానెల్ విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో తానా సభ్యులు నరేన్ కొడాలి టీమ్‌కు విజయాన్ని అందించారు. ఆన్ లైన్ ద్వారా మొదటిసారిగా ఈ ఎన్నికలు జరగడంతో అందరికీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. గురువారం మధ్యాహ్నం కౌంటింగ్ తరువాత ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కనకంబాబు ఐనంపూడి ఫలితాలను వెల్లడించారు. తానా తదుపరి అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన డా. నరేన్ కొడాలి గెలుపొందారు. నరేన్‌కు 13225 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి సతీష్ వేమూరికి 10362 ఓట్లు లభించాయి. నరేన్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా పోటీ చేసిన రాజా కసుకుర్తి విజయాన్ని అందుకున్నారు. కోశాధికారిగా మద్దినేని భరత్ గెలుపొందారు.
విజేతల వివరాలు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – నరేన్ కొడాలి
కార్యదర్శి – రాజా కసుకుర్తి
ట్రెజరర్ – భరత్ మద్దినేని
జాయింట్ సెక్రటరీ…వెంకట్ కోగంటి
జాయింట్ ట్రెజరర్…సునీల్ పాంట్ర
కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్…లోకేష్ నాయుడు కొణిదెల
కల్చరల్ సర్వీస్ కో ఆర్డినేటర్….ఉమా కటికి
ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్…సోహ్ని అయినాల
కౌన్సిలర్ ఎట్ లార్జ్….సతీష్ కొమ్మన
ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్….టాగూర్ మల్లినేని
స్పోర్ట్స్ కో ఆర్డినేటర్…నాగ పంచుమర్తి
రీజినల్ రిప్రజెంటేటివ్‌లు
సౌత్ ఈస్ట్ …మధుకర్ యార్లగడ్డ
అప్పలాచియాన్…రాజేష్ యార్లగడ్డ
న్యూఇంగ్లాండ్…కృష్ణ ప్రసాద్ సోంపల్లి
నార్త్…నీలిమ మన్నె
నార్త్ సెంట్రల్…శ్రీమాన్ యార్లగడ్డ
సదరన్ కాలిఫోర్నియా….హేమ కుమార్ గొట్టి
నార్త్ కాలిఫోర్నియా….వెంకట్ అడుసుమిల్లి
నార్త్ వెస్ట్…. సురేష్ పాటిబండ్ల
క్యాపిటల్…సతీష్ చింత
మిడ్ అట్లాంటిక్…వెంకట్ సింగు
సౌత్ వెస్ట్….సుమంత్ పుసులూరి
డిఎఫ్‌డబ్ల్యు…పరమేష్ దేవినేని
న్యూజెర్సి….రామకృష్ణ వాసిరెడ్డి
న్యూయార్క్…దీపిక సమ్మెట
ఓహాయోవ్యాలీ…శివ చావా
బోర్డ్ డైరెక్టర్స్
శ్రీనివాస్ లావు
రవి పొట్లూరి
మల్లిఖార్జున వేమన
ఫౌండేషన్ ట్రస్టీస్
రామకృష్ణ చౌదరి అల్లు
భక్త బల్ల
శ్రీనివాస్ కూకట్ల
రాజా సూరపనేని
శ్రీనివాస్ ఎండూరి







